గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఘాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాసర పుష్కర ఘాట్‌ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతీ పుష్కరఘాట్‌ వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మండలాల వారీగా రెవెన్యూ, ఇంజినీరింగ్‌, పోలీసు, విద్యుత్‌, శాఖల అధికారులు ఘాట్లను సందర్శించి, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ఘాట్‌ వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సహాయాన్ని అందించేందుకు చ ర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో, పుష్కరఘాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని తెలిపారు. సమావేశంలో భైంసా సబ్‌ క లెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, అదనపు ఎస్పీ ఉ పేంద్రారెడ్డి, వివిధ విభాగాల ఇంజినీరింగ్‌ అధి కారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement