హనుమాన్‌ విగ్రహానికి రూ.30 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ విగ్రహానికి రూ.30 లక్షల విరాళం

Feb 9 2026 8:08 AM | Updated on Feb 9 2026 8:08 AM

హనుమాన్‌ విగ్రహానికి రూ.30 లక్షల విరాళం

హనుమాన్‌ విగ్రహానికి రూ.30 లక్షల విరాళం

లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్‌ గ్రామంలో భారీ హనుమాన్‌ విగ్రహం ఏర్పాటుకు ఆదివారం భూమిపూజ చేశారు. మండలంలోని వడ్యాల్‌ గ్రామంలో 22 అడుగుల ఎత్తతో ఏర్పాటు చేస్తున్న అభయాంజనేయ రాతి విగ్రహానికి ఇదే గ్రామానికి చెందిన నల్ల వినయ్‌రెడ్డి రూ.30 లక్షలు విరాళంగా అందిస్తున్నారు. వేద పండితులు పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోమం చేశారు. విగ్రహానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని నల్ల వినయ్‌రెడ్డి తెలిపారు. ఇందులో మాజీ ఎంపీపీ నల్ల నరేందర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ కల్పనరెడ్డి, డాక్టర్‌ గోవర్ధన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ నరేశ్‌, ఉప సర్పంచ్‌ రవీందర్‌, నాయకులు నరేశ్‌రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement