విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

Feb 1 2026 6:31 AM | Updated on Feb 1 2026 6:31 AM

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

లక్ష్మణచాంద: పూర్వ ప్రాథమిక విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అంగన్‌వాడీ టీచర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ సూచించారు. మండలంలోని వడ్యాల్‌లో శనివారం నిర్వహించిన అంగన్‌వాడీ టీచర్ల క్లస్టర్‌ సమావేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. చిన్నారులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించాలని పేర్కొన్నారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య నేర్పించాలని ఆదేశించారు. అభయ్‌, అఫా వంటి యాప్‌ నమోదులో కలుగుతున్న ఇబ్బందులను అంగన్‌వాడీ టీచర్లు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సీడీపీవో నాగలక్ష్మి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement