ఆర్జీయూకేటీలో గాంధీ వర్ధంతి | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో గాంధీ వర్ధంతి

Jan 31 2026 10:22 AM | Updated on Jan 31 2026 10:22 AM

ఆర్జీయూకేటీలో గాంధీ వర్ధంతి

ఆర్జీయూకేటీలో గాంధీ వర్ధంతి

బాసర: బాసర ఆర్జీయూకేటీలో మహాత్మాగాంధీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలోని గాంధీ చిత్రపటానికి ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ ఏ.గోవర్ధన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గాంధీజీ బోధించి న సత్యం, అహింస అనే ఆయుధాలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు గాంధీ మార్గంలో నడవాలని పిలుపుని చ్చారు. ఓఎస్డీ మురళీదర్శన్‌ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాట పటిమను, సామాజిక సంస్కరణలపై ఆయనకున్న అంకితభావాన్ని కొని యాడారు. కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్స్‌ ఎస్‌.విఠల్‌, కె.మహేశ్‌, ఎస్‌. శేఖర్‌, డీఎస్‌డబ్ల్యూవో జి.నాగరాజు, సీఎస్‌వో రాజేశ్‌, చంద్రశేఖర్‌రావు, శంకర్‌, సాంస్కృతిక శాఖ సభ్యులు ఎం.రమాదేవి, నాగలక్ష్మి, శ్రీవిద్య, సారిక, .శ్వేత, శ్రీలక్ష్మి ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని బాపూజీకి అంజలి ఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement