గణతంత్ర స్ఫూర్తితో ప్రజాపాలన
జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.45 కోట్లు మంజూరుచేసినట్లు చెప్పారు.
మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై రూ.676.592 కోట్లతో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని సీఎం ప్రారంభించి, దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టుకు యాసంగి నీటిని వదిలారని తెలిపారు.
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళసంఘాలకు రూ.550 కోట్ల విలువగల చెక్కులు అందించారన్నారు.
మెప్మాద్వారా పట్టణ మహిళ సంఘాలకు రూ.107 కోట్ల చెక్కులు అందించారని చెప్పారు.
జిల్లాకేంద్రంలో నర్సింగ్ కాలేజీకి రూ.26 కోట్లు, పంచాయతీల్లో మౌలిక వసతులకు రూ.30.02 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
అభివృద్ధి, సంక్షేమం నిరంతరం పారదర్శకత, సమష్టిభావంతో పనులు మున్సిపాలిటీలకు రూ.45 కోట్లు గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ సందేశం జిల్లావ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే
నిర్మల్
మాట్లాడుతున్న కలెక్టర్ అభిలాష అభినవ్
శివంగి దళానికి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్, ఎస్పీ
నిర్మల్: ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు జిల్లాలో అమలు చే స్తూ, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి తో ప్రజాపాలన అందిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నా రు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్‌అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్‌కుమార్, నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి, ఏఎస్పీలు రాజేశ్‌మీనా, సాయికిరణ్, ఉపేంద్రారెడ్డి, ఐఎఫ్‌ఎస్ సుశాంత్‌సుఖ్‌దేవ్ బోబడే పాల్గొన్నారు. కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన సందేశాన్ని వినిపించారు.
పేదలకు ఇళ్లు.. రైతులకు భరోసా..
ప్రజాపాలనలో భాగంగా పేదలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ అభిలాషఅభినవ్ పేర్కొన్నారు. పేదల సొంతింటి కల ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.
సంక్షేమ పథకాలతో..
రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనతో..
జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనలో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ వివరించారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతామన్నారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పురప్రముఖులు పాల్గొన్నారు.
జాతీయ జెండాతో
చిన్నారి
గణతంత్ర స్ఫూర్తితో ప్రజాపాలన
గణతంత్ర స్ఫూర్తితో ప్రజాపాలన


