సమయం లేదు మిత్రమా..!
– వివరాలు 8లోu
న్యూస్‌రీల్
మోగిన ‘పుర’ నగారా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ కేవలం మూడురోజులే గడువు జిల్లాలో తేలని అభ్యర్థులు అయోమయంలో ఆశావహులు
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న రైతులు రవాణా సౌకర్యం లేక ఇక్కట్లు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలకు ఎదురుచూపు
సమ్మక్క జాతర పోయొద్దామా..
నిర్మల్
7
కాగజ్‌నగర్ మండలం నందిగూడ సమీపంలో గద్దెలు
ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని మహిళా ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్‌వో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సాధించిన ప్రగతి గురించి సమీక్షించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహణ అధికారులు డాక్టర్ నైనారెడ్డి, డాక్టర్ సౌమ్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డిప్యూటీ అధికారి డాక్టర్ ఆకాశ్, ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు.
నిర్మల్: పురపోరుకు మంగళవారం నగారా మోగింది. పట్టణాల్లో హీట్ పెంచింది. పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సమయం ఇవ్వకుండా బిజీ షెడ్యూల్ ఇచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం పక్షంరోజుల్లోనే కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. బల్దియాల్లో బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. బరిలో ఎవరు ఉండాలనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోవడం, అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడం, ఇంతలోనే షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి పెరిగింది. ఆశావహులు మంగళవారం సాయంత్రం నుంచే ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుల ఇళ్లవద్ద బారులుతీరారు. నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభమై మూడు రోజుల్లోనే ముగస్తుండటంతో ఇన్నిరోజులు పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆశావహులూ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈమేరకు నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అభ్యర్థులే ఫైనల్ కాలేదు..
ఓదిక్కు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇంకా మున్సిపల్ బరిలో నిలిచే తమ అభ్యర్థులను ఏ పార్టీ ప్రకటించలేదు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ప్రతిష్టాత్మకంగా బరిలో దిగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ సీట్ల కోసం పోటాపోటీ వాతావరణం ఉంది. నిర్మల్‌లో 42 వార్డులు, భైంసాలో 26, ఖానాపూర్‌లో 12 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్ల లెక్కతేలినా అభ్యర్థుల జాబితాను మాత్రం పార్టీలు తేల్చలేదు. నోటిఫికేషన్ రావడంతోనే వెంటనే షెడ్యూల్ ప్రకటించడం, అందులో బుధవారం నుంచే మూడురోజుల్లోనే నామినేషన్ల గడువు ముగుస్తుండడం ఆశావహులను కలవరపెడుతోంది. ఎవరో ఒకరిపేరు ప్రకటిస్తే.. మిగతావాళ్లు ఏం చేయాలో తేల్చుకుంటామన్న భావనను ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లచుట్టూ ఆశావహులు తిరగడం కనిపించింది. నామినేషన్లతోపాటు ప్రచారానికీ సమయం ఎక్కువగా లేకపోవడంతో వారంతా కంగారు పడుతున్నారు. దాదాపు బుధవారం తమ అభ్యర్థులను ఫైనల్ చేయవచ్చని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.
విద్యుత్ సమస్యల
పరిష్కార వేదిక
ముధోల్: మండల కేంద్రంలో తెలంగాణ ఉత్త ర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, సభ్యుడు రాజాగౌడ్ పాల్గొన్నారు. పలువురు విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేయగా చాలావరకు అక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఏఈ శ్రీకాంత్ తెలిపారు.
జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం వన దేవతల జాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. నిర్వాహకులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు.
నేటి నుంచే నామినేషన్లు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 30వరకు మాత్రమే గడువు ఇచ్చారు. అంటే కేవలం మూడురోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మూడురోజులపాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి నామినేషన్ పత్రాల స్క్రూటినీ చేపట్టనున్నారు. ఆ వెంటనే సరైన నామినేషన్లు ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలలోపు అప్పీల్‌కు వెళ్లొచ్చు. వచ్చేనెల 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వచ్చేనెల 3న సాయంత్రం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. 3 గంటల తర్వాత అభ్యర్థుల ఫైనల్ జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న ఫలితాల ప్రకటన ఉండనున్నాయి.
నామినేషన్ కేంద్రాలు ఇవే
ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ సుజాత
మున్సిపాలిటీల వారీగా ఓటర్లు
మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
నిర్మల్ 47,362 50,824 18 98,204
భైంసా 25,486 25,623 9 51,118
ఖానాపూర్ 8,524 9,169 0 17,693
నిర్మల్ మున్సిపాలిటీలో ఈసారి మూడుచోట్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మున్సిపాలిటీ రెవెన్యూ సెక్షన్‌లో 1నుంచి 10వ వార్డు వరకు, పైఅంతస్తులోని కౌన్సిల్‌హాల్‌లో 11వ వార్డు నుంచి 28వ వార్డు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29వ వార్డు నుంచి 42వ వార్డు వరకు జెడ్పీ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. భైంసాలో మున్సిపల్ కార్యాలయంలో, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
సమయం లేదు మిత్రమా..!
సమయం లేదు మిత్రమా..!
సమయం లేదు మిత్రమా..!
సమయం లేదు మిత్రమా..!
సమయం లేదు మిత్రమా..!
సమయం లేదు మిత్రమా..!


