అభ్యర్థుల ఎంపికే ముఖ్యం
ఖానాపూర్: త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికే కీలకమని పార్టీ మున్సిపల్ ఎన్నికల ఖానాపూర్ ఇన్‌చార్జి అబ్దుల్ ముజీబ్ అన్నారు. పట్టణంలోని బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో మంగళవారం మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తలను నియమించిన నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జిగా హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్‌ను నియమించారు. ఆయన మంగళవారం పట్టణానికి రావడంతో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.


