● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ, అవకాశవాద రాజకీయాలే ఎక్కువ ● సాక్షితో నిర్మల్‌ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్‌ | - | Sakshi
Sakshi News home page

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ, అవకాశవాద రాజకీయాలే ఎక్కువ ● సాక్షితో నిర్మల్‌ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్‌

Jan 31 2026 10:22 AM | Updated on Jan 31 2026 10:22 AM

● ఇచ్

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ,

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ, అవకాశవాద రాజకీయాలే ఎక్కువ ● సాక్షితో నిర్మల్‌ మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: అప్పట్లో రాజకీయాలు అంటే సేవాతత్పరత, నమ్మకం ఉండేవి. ప్రజల విశ్వాసం చూరగొనేలా పనులు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందంటున్నారు. ఒకప్పుడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు పనిచేసిన నేతలు. ఇప్పటి రాజకీయాల అర్థాలే మారిపోయాయని పేర్కొంటున్నారు. సేవాభావం స్థానంలో స్వార్థం, విశ్వాసం స్థానంలో అవకాశవాదం వచ్చాయని పేర్కొంటున్నారు. 1995–2000 కాలంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన అయ్యన్నగారి భూలక్ష్మి, 2006 – 2010 వరకు చైర్‌పర్సన్‌గా పనిచేసిన అప్పాల అనురాధ, మాజీ కౌన్సిలర్‌ చిలక గోవర్ధన్‌ తమ హయాంలో రాజకీయాల గురించి వెల్లడించారు.

చరిత్రలో నిలిచేలా పనులు చేశాం..

అధికారం చేపట్టిన నాటి నుంచే అభివృద్ధిని ఎజెండాగా మార్చుకున్నా. పట్టణంలోని ప్రతి గల్లీలో పర్యటించాను. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నా. తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చా. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి పన్ను వసూలు చేయకుండా ఉన్న గృహాలను రెగ్యులరైజ్‌ చేసి పన్నులు వసూలు చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే 1997లో నిర్మల్‌ ము న్సిపాలిటీకి ఉత్తమ పురస్కారం దక్కింది. అప్ప టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.1,50,000 రివార్డును పొందాను. ఆదర్శనగర్‌ లో వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టి ఈద్గాం, రామ్‌నగర్‌, సిద్ధాపూర్‌ కాలనీలకు తాగునీటి సమ స్య తీర్చాం. ప్రస్తు తం ఉన్న జిల్లా గ్రంథాలయ కేంద్రం మా హయాంలో కేటాయించబడిన స్థలమే. 1997లో జన్మభూమి కార్యక్రమం మున్సిపాలిటీలో పకడ్బందీగా చేపట్టినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాం.

రిజర్వేషన్‌ కలిసి రావడంతో..

మా ఆయన అయ్యన్నగారి భూమయ్య 1995లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండే వారు. 1995లో నిర్మల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి మహిళకు రిజర్వ్‌ అయింది. అప్పటి పరిస్థితులలో బీజేపీ తరఫున నాకు టికెట్‌ ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు మరో నలుగురు బరిలో నిలవగా 4వేల ఓట్ల మెజారిటీతో గెలిచి నిర్మల్‌ బల్దియాకు చైర్పర్సన్‌ అయ్యాను. 2000 వరకు పదవిలో కొనసాగాను. నిర్మల్‌ మున్సిపాలిటీ చరిత్రలో తొలి మహిళా చైర్పర్సన్‌ నిలిచిపోయాను.

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ,1
1/2

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ,

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ,2
2/2

● ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వాళ్లం ● ఇప్పుడు స్వార్థ,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement