అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వెల్లడించాలి
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.వీరారెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌తో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని రకాల ఫారాలు, రిజిస్టర్లను సక్రమంగా పూరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు షుజావుద్దీన్, డీఈవో భోజన్న, డీసీవో నర్సయ్య, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


