ఎక్స్‌ అఫీషియోల ఎంపికకు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ అఫీషియోల ఎంపికకు నోటీసులు

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

ఎక్స్‌ అఫీషియోల ఎంపికకు నోటీసులు

ఎక్స్‌ అఫీషియోల ఎంపికకు నోటీసులు

● ఎస్‌ఈసీ రాణి కుముదిని

నిర్మల్‌చైన్‌గేట్‌: మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో ఎక్స్‌ అఫీషియోల ఎంపిక కోసం నోటీసులు జారీచేసి ఆప్షన్‌ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని సూచించారు. కలెక్టర్లు, అధికారులకు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరోక్ష విధానం ద్వారా చేసే ఎన్నిక సమయంలో పార్లమెంట్‌ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్‌ అఫీషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకుని ఆప్షన్‌ ఇచ్చుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఇంతవరకు ఆప్షన్‌ ఇవ్వని పక్షంలో మున్సిపల్‌ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్‌ను మున్సిపల్‌ కమిషనర్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, 11 నుంచి 14 లోపు నోటీస్‌ జారీచేసి ప్రజాప్రతినిధుల నుంచి ఆప్షన్‌ తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement