సామాజిక న్యాయం అందాలి | - | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం అందాలి

Feb 5 2026 7:17 AM | Updated on Feb 5 2026 7:17 AM

సామాజిక న్యాయం అందాలి

సామాజిక న్యాయం అందాలి

● సామాజిక న్యాయ దినోత్సవంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● మొబైల్‌ యాప్‌పై అవగాహన

నిర్మల్‌చైన్‌గేట్‌: సమాజంలోని ప్రతీ వర్గానికి సా మాజిక న్యాయం అందాలని కలెక్టర్‌ అభిలాష అ భినవ్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సామాజిక న్యాయ దినోత్సవా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్‌ సామాజిక న్యాయ ప్రతిజ్ఞ చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం తదితర అంశాలపై అవగాహన కల్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకే కాకుండా, ప్రతీ పౌరుడికి సమన్యాయం అందేలా వ్యవస్థ పనిచేయాలని సూచించారు. సామాజిక న్యాయం అనే ది ప్రభుత్వ పరిరక్షణకే కాకుండా, ప్రతీ పౌరుడి మౌలిక హక్కు అని పేర్కొన్నారు. సామాజిక న్యా య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపన్యాసాలతోపాటు వివిధ పోటీలు ని ర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

యాప్‌లో వివరాలు నమోదు చేయాలి

ప్రభుత్వ వసతిగృహాల్లో సౌకర్యాల పర్యవేక్షణకు రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌పై కలెక్టర్‌ అధికారులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు వసతిగృహాలను సందర్శించినప్పుడు అక్కడి సదుపాయాల వివరాలను ఫొటోలతో యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. దీంతో వసతిగృహాల సమగ్ర సమాచారం సులభంగా సేకరించడానికి సదుపాయాల మెరుగుదలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ను జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్‌ అహ్మద్‌, కిశోర్‌కుమార్‌, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement