జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
కుభీర్: ముధోల్‌లో బుధవారం నిర్వహించిన ని యోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీల్లో మండలా నికి చెందిన వాలీబాల్ బాలురు, బాలికల జట్లు గెలిచి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాయి. గెలుపొందిన జట్లను పలువురు అభినందించారు. జిల్లా స్థాయిలోనూ గెలవాలని ఆ కాంక్షించారు. గెలిచిన జట్లకు ఎమ్మెల్యే రామారా వ్ పటేల్ ట్రోఫీలు అందజేశారు. ఎంపీడీవో గంగ సాగర్‌రెడ్డి, ఎంఈవో విజయ్‌కుమార్, పీడీ క్రాంతికుమార్, క్రీడాకారులు, అధికారులున్నారు.
నర్సాపూర్(జీ): సీఎం కప్ నియోజకవర్గ స్థాయి కబడ్డీ, చెస్, అథ్లెటిక్స్, వాలీబాల్ పోటీల్లో మండలానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీ బాలికల విభాగం మొదటి స్థానంలో సోనీ, మమత, సోనూనుతాయి, వైష్ణవి, హర్షవర్ధని, నిషా, షిఫా, చెస్‌లో సాత్విక్, వాలీబాల్ పోటీల్లో మధుప్రియ, అవంతిక, అథ్లెటిక్స్ పోటీల్లో మొదటి స్థానంలో అభినయ్, అజయ్ ఎంపికై నట్లు పీడీ దేవేందర్ తెలిపారు. వీరిని అభినందించారు.
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక


