బరిలో తాజా మాజీలు | - | Sakshi
Sakshi News home page

బరిలో తాజా మాజీలు

Feb 5 2026 7:17 AM | Updated on Feb 5 2026 7:17 AM

బరిలో

బరిలో తాజా మాజీలు

● మరోసారి కౌన్సిలర్లుగా పోటీ ● రిజర్వేషన్‌ కలిసిరాని ఆశావహులు పక్క వార్డుల నుంచి రంగంలోకి.. ● బంధువులను దింపిన నాయకులు

నిర్మల్‌టౌన్‌: మున్సిపల్‌ ఎన్నిక బరి లో తాజా మాజీ కౌన్సిలర్లు మరోసా రి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబో తున్నారు. గత పాలకవర్గంలో నిర్మల్‌ మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్‌గా గె లిచినవారు మళ్లీ నామినేషన్‌ వేశారు. తాము వార్డులో చేసిన అభివృద్ధి పనులు, వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలపై అవగాహనే తమ ప్రధాన బలమంటూ వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

అదృష్టం పరీక్షించుకుంటున్న వారిలో..

కత్తి నరేందర్‌ గత ఎన్నికల్లో 36వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించక ఒకటో వార్డు నుంచి బరిలోకి దిగారు. రెండోవార్డు నుంచి సాదం అరవింద్‌ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందగా, ప్రస్తుతం రిజర్వేషన్‌ అనుకూలించక తన భార్య స్వప్నను అదే పార్టీ నుంచి పోటీలోకి దింపారు. నాలుగో వార్డులో బిట్లింగ్‌ నవీన్‌ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి ఈసారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. తొమ్మిదోవార్డు నుంచి అయ్యన్నగారి రాజేందర్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆయన గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలువగా, ఈసారి అదే పార్టీ నుంచి 30వ వార్డు నుంచి బరిలోకి దిగుతున్నారు. 14వ వార్డు నుంచి మతిన్‌ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి ఈసారి ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచాడు. 17వ వార్డు నుంచి పార్వీన్‌ గతంలో ఎంఐఎం, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. 18వ వార్డు నుంచి పురస్తు రూప గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందగా ఇప్పుడు బీజేపీ నుంచి తన కుమారుడు వినయ్‌ను పోటీలో నిలిపారు. 20వ వార్డు నుంచి అంజుంబేగం గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందగా ఈసారి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. 21వార్డు నుంచి ఇమ్రాన్‌ ఉల్లా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించక 22వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి పోటీలో దిగారు. 24వ వార్డు నుంచి మేడారం ప్రదీప్‌ గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఆ తర్వాత రిజర్వేషన్‌ అనుకూలించక అతడి భార్య అపర్ణ రెండుసార్లు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి బరిలో నిలిచారు. 26వ వార్డు నుంచి ఆకుల లక్ష్మీనర్స గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించి మరోసారి అదృష్టాన్ని కాంగ్రెస్‌ నుంచి పరీక్షించుకుంటున్నారు. 27వ వార్డు నుంచి అయేషా కౌసర్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి మరోసారి బరిలో నిలిచారు. 30వ వార్డు నుంచి సముందర్‌పల్లి రాజేందర్‌ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. 39వ వార్డు నుంచి తౌహీద్‌ ఉద్దీన్‌ రఫ్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఈసారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బరిలో బంధుగణం..

మున్సిపల్‌ ఎన్నికల బరిలో సీనియర్‌ నేతల బంధువులు, సీనియర్‌ నాయకురాలు దిగారు. ప్రజాభిమానాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అభివృద్ధి పనులే తమ అస్త్రంగా, అనుభవమే తమ బలమని చెబుతూ రంగంలోకి దిగుతున్నారు. 2019 జనరల్‌ ఎన్నికల్లో బీఎల్పీ నుంచి ఎమ్మెల్యేగా అలివేలి మంగ పోటీ చేశారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరి పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లో తొమ్మిదోవార్డులో బీజేపీ నుంచి పోటీలోకి దిగారు. రావుల రాంనాథ్‌ 1991నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ.. పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారు. ప్రస్తుతం బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల జిల్లా కన్వీనర్‌గా పని చేస్తున్నారు. ఈయన కుమార్తె రావుల రమ్యను ప్రస్తుతం పట్టణంలోని 13వ వార్డు నుంచి బరిలోకి దింపారు. తన రాజకీయ సీనియార్టీని ప్రయోగించి తన కుమార్తెను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

బరిలో తాజా మాజీలు1
1/1

బరిలో తాజా మాజీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement