నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Feb 5 2026 7:17 AM | Updated on Feb 5 2026 7:17 AM

నిర్మ

నిర్మల్‌

గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

కమలం, కాంగ్రెస్‌ మధ్యలో ‘కారు’

భైంసా, నిర్మల్‌లో ‘పతంగి’ ఫైట్‌

బీఎస్పీ, ఆప్‌, జనసేనలూ బరిలో..

తగ్గని రెబెల్స్‌, ఇండిపెండెంట్లు

అంతటా పోటాపోటీగా ప్రచారం

వార్డుల బాట పట్టిన సీనియర్లు

అమ్మో.. బూచోళ్లు..!
చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై వారికి అవగాహన కల్పించాలని మానసిక వైద్యనిపుణలు సూచిస్తున్నారు.

భైంసాలో తనిఖీలు

భైంసాటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా పట్టణంలో మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన వీధుల్లో తిరుగుతూ పెట్రోలింగ్‌, పికెటింగ్‌ పాయింట్లను పరిశీలించారు. నామినేషన్‌ కేంద్రం వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సీఐ సాయికుమార్‌, ఎస్సైలున్నారు.

నిర్మల్‌: ఐదేళ్లలో మున్సిపల్‌ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇప్పుడు ఉనికి కోసం కొట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కనీసం సీట్లు, ఓట్లు రాని పార్టీలు ఇప్పుడు గట్టి పోటీనిస్తున్నాయి. ఈసారి తామే గెలుస్తామన్న ధీమా ప్రతీ పార్టీలో కనిపిస్తోంది. ఎవరి పోరు వారిదే అన్నట్లుగా వార్డుల్లో ఫైట్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా పైకి ప్రకటించకున్నా.. లోలోపల పలు పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయి. జిల్లాలో మాత్రం అలాంటి పొత్తులేవీ కనిపించడం లేదు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడుచోట్లా ఎవరికివారే అన్నట్లుగా పార్టీలు బరిలో ఉన్నాయి. దాదాపు ప్రతీవార్డులో కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా.. నేనా? అనే తరహాలో తలపడుతున్నాయి. కొన్నివార్డుల్లో ఈరెండు పార్టీల మధ్యలోకి బీఆర్‌ఎస్‌ కారు దూసుకువస్తోంది. భైంసా, నిర్మల్‌ మున్సిపాలిటీల్లో తామే కీలకమవుతామని ఎంఐఎం ‘పతంగి’ ఎగురవేస్తోంది. ప్రధాన పార్టీలకు తామేం తీసిపోమంటూ బీఎస్పీ, ఆప్‌తోపాటు రెబెల్స్‌, స్వతంత్రులూ పోటీపడుతున్నారు.

నిర్మల్‌ మున్సిపాలిటీలో..

జిల్లాకేంద్రమైన నిర్మల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. రెండు పార్టీలు కూడా మొత్తం 42వార్డుల్లో అభ్యర్థులను నిలిపాయి. ఈసారి మైనార్టీలు ఎక్కువగా ఉన్న వార్డుల్లోనూ బీజేపీ అభ్యర్థులను నిలుపడం గమనార్హం. గతంలో బల్దియాలో కలిసి పనిచేసిన బీఆర్‌ఎస్‌ నుంచి 36మంది, ఎంఐఎం నుంచి 19మంది వేర్వేరుగా బరిలో ఉన్నారు. ఎంఐఎం పోటీచేస్తున్న వార్డుల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలిపింది. నిర్మల్‌లో 2014లో అత్యధిక వార్డులు గెలిచి, అధికారంలోకి వచ్చిన బీఎస్పీ ఈసారి 11స్థానాలకే పరిమితమైంది. ఆప్‌ తొలిసారి నాలుగుచోట్ల, సీపీఎం, జనసేన ఒక్కోచోట పోటీలో ఉన్నాయి. ఆంధ్రలో బీజేపీతో పొత్తులో ఉన్నా.. జనసేన ఇక్కడ పోటీ పడుతోంది.

భైంసా బల్దియాలో..

తెలంగాణ సరిహద్దు బల్దియాగా, సున్నిత ప్రాంతంగా పేరున్న భైంసాపై అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడ మొత్తం 26వార్డుల్లో కాంగ్రెస్‌ 24, బీజేపీ 12, బీఆర్‌ఎస్‌ 15, ఎంఐఎం 18వార్డుల్లో తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఈసారి రెబెల్స్‌ బెడద తప్పడం లేదు. మూడు ప్రధాన వార్డుల్లో సొంతపార్టీ నేతలే పోటీలో నిలిచారు. భైంసాలో ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచీ పలువురు బరిలో ఉన్నారు. ఎంఐఎం పోటీచేస్తున్న పలువార్డుల్లోనూ బీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను బరిలో నిలిపింది.

మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ఖానాపూర్‌ రెండో ఎన్నికను ఎదుర్కొంటోంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మూడు పార్టీలూ మొత్తం 12వార్డుల్లో పోటీపడుతున్నాయి. ఈసారి ఎంఐఎం, బీఎస్పీ రెండువార్డుల్లో బరిలో నిలువగా, 18మంది ఇతరులు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ఉన్నచోటా ఎంఐఎం పోటీ చేస్తోంది. ఏ రెండుపార్టీలు, అభ్యర్థులూ పొత్తులదిక్కు వెళ్లకుండా పోటీపడుతున్నారు. ఎవరికివారే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నాలుగో వార్డులో బీజేపీకి రెబెల్‌ ఉండగా, ఐదోవార్డులో కాంగ్రెస్‌ నేత బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు.

ఖానాపూర్‌ ‘పుర’ పోరులో..

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement