● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపత
లోకేశ్వరం: జీరామ్‌జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి డిమాండ్ చేశారు. మండలంలోని పుస్పూర్ గ్రామంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు పని కల్పిస్తున్న ఉపాధి చట్టం రద్దు చేసి జీరామ్‌జీ చట్టాన్ని తేవడం ప్రజల ఉపాధి హక్కుని దెబ్బతిస్తుందన్నారు. కార్పొరేట్‌లకు అనుకూలంగా బిల్లు రూపొందించిందని విమర్శించారు. కూలీలకు రోజుకు రూ.800 చెల్లించి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్, నాయకులు కృష్ణదాస్, తిమ్మాపురం ముత్తన్న, గ్రామ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.


