ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య
నిర్మల్ రూరల్: ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఇంటర్మీడియెట్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్– టీచర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ విద్య బలోపేతానికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు. నెల రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలవుతాయని అప్పటివరకు విద్యార్థులను తప్పనిసరిగా కళాశాలకు పంపాలని సూచించారు. డీఐఈవో పరశురాం మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమన్నారు. అనంతరం కళాశాలలో చదివి ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. కళాశాల పనితీరుకు సంబంధించి తయారుచేసిన వీడియోను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రీఫైనల్ పరీక్షల్లో సాధించిన ఫలితాలను తల్లిదండ్రులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు విజయలక్ష్మి, నవీన్‌కుమార్, సత్యపాల్‌రెడ్డి, ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


