ముగిసిన వన్యప్రాణుల గణన
నిర్మల్‌టౌన్: ఈనెల 20 నుంచి నిర్వహించిన వ న్యప్రాణుల గణన ఆదివారంతో ముగిసింది. ఆరు రోజులుగా శాఖాహార, మాంసాహార జంతువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి ప్ర త్యక్ష, పరోక్ష ఆధారాలను మొబైల్ యాప్‌లో న మోదు చేశారు. జిల్లాలో 102 బీట్‌లో వన్యప్రాణుల గణన చేశారు. దీనిలో బీట్ అధికారులు, సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారులు పాల్గొన్నా రు. వీరితోపాటు ఎన్జీవో సభ్యులు, 60 మంది వలంటీర్లు పాల్గొన్నారు. వన్యప్రాణుల గణనలో పాల్గొన్న వలంటీర్లకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో నిర్మల్ ఎఫ్‌డీవో నాగిని భాను ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఖానాపూర్ డివిజన్‌లో..
ఖానాపూర్: ఖానాపూర్ డివిజన్ పరిధిలో జంతు, వృక్ష గణన విజయవంతంగా ముగిసిందని ఖానాపూర్ ఎఫ్‌డీవో శివకుమార్ తెలి పారు. పట్టణంలోని ఎఫ్‌డీవో కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సర్వే వివరాలన్నీ ఆన్‌లైన్ ద్వారా యాప్‌లో అప్‌లోడ్ చేశామన్నారు. త్వరలో సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అనంతరం గణనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారికి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.


