ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌లో వేగం పెంచాలి

Feb 1 2026 6:31 AM | Updated on Feb 1 2026 6:31 AM

ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌లో వేగం పెంచాలి

ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌లో వేగం పెంచాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ఓటరు ప్రోజెని మ్యాపింగ్‌ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. 2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరిపోల్చి మ్యాపింగ్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేపట్టాలన్నారు. బీఎల్‌వోలు రోజువారీగా చేపట్టి ప్రోజెని మ్యాపింగ్‌ వివరాలు తమకు అందించాలని తెలిపారు. ఎక్కడైనా పోలింగ్‌ బూత్‌లలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బూత్‌లకు చెందిన బీఎల్‌వోలను సమన్వయం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, నిర్మల్‌, ఖానాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్‌, సుందర్‌సింగ్‌, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల

నిర్మాణం ప్రారంభించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వారం రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు. ఎంపికై న లబ్ధిదారులు వెంటనే పునాది పనులు మొదలుపెట్టేలా క్షేత్రస్థాయి అధికారులు ప్రోత్సహించాలన్నారు. నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. పనులు పూర్తయి దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేలా చూడాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌, ఆయా మండల ప్రత్యేక అధికారులు శంకర్‌, బాలిక్‌ అహ్మద్‌, శ్రీనివాస్‌, రాజనర్సయ్య, మండల హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement