సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
నిర్మల్‌టౌన్: నిర్మల్ మున్సిపల్ అధికారులు పన్ను ల వసూలుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అద్దె భవనంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఓ ప్రైవేట్ పాఠశాలను శని వారం సీజ్ చేశారు. పాఠశాల యాజమాన్యం రూ.2 లక్షలకుపైగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రూ.87,297 పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. 15 రోజుల క్రితం రెడ్ నోటీసులు జారీ చేశారు. అయినా అలసత్వం వహించడంతో పాఠశాలను, సబ్ రిజిస్ట్రార్ కార్యాయాన్ని సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ అధికారి రాజు, బిల్ కలెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు.


