కమనీయం.. రమణీయం
కడెం: మండలం దిల్దార్‌నగర్, ఎలగడప, సారంగపూర్ గ్రామాల సమీపంలోని కొండపై కొలువుదీరిన పురాతన అక్కకొండ శ్రీలక్ష్మీనరసింహాస్వామి కల్యాణం ప్రధాన అర్చకులు వొద్దిపర్తి వెంకరమణాచార్యులు ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తుల తరలివచ్చారు. ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ అక్కకొండ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్నారు. వంశీకి ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పుల లక్ష్మణ్, గౌరవ అధ్యక్షుడు జగ్గరావు, సర్పంచులు స్టీఫెన్, ఆశ్విత, కోల తేజస్విని తదితరులు పాల్గొన్నారు.


