అంబరాన్నంటేలా సంబురాలు
● కొనసాగుతున్న నిర్మల్ ఉత్సవాలు ● మరోరోజు పొడగించిన కలెక్టర్
నిర్మల్ చైన్‌గేట్: చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ వేడుకలుగా నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఐదు రోజులుగా స్థానిక మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. మొదట ఐదు రోజుల ఉత్సవాలుగా మాత్రమే ప్రకటించడంతో శుక్రవారం భారీ సంఖ్యలో జిల్లావాసులు తరలివచ్చారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరో రోజు ఉత్సవాలను పొడిగిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో చరిత్రను తెలుసుకోవడంతోపాటు, సాంస్కతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరిస్తున్నారు.


