సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

Feb 7 2026 2:49 PM | Updated on Feb 7 2026 2:49 PM

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

భైంసాటౌన్‌/లోకేశ్వరం: కార్మికుల సమస్యల పరిష్కారం ఈనెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.హరిత పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలోని శివాజీ బీడీ సెంటర్‌లో, లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌ గ్రామంలోని శివాజీ బీడీ ప్యాకింగ్‌ కేంద్రం వద్ద సమ్మె పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, కార్మిక, శ్రామిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. బీడీ పరిశ్రమ నాశనానికి జీఎస్టీ విధిస్తోందని, బీడీ కార్మికులకు నష్టం చేసే కోప్టా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస పింఛన్‌ రూ.9 వేలు ఇవ్వాలని, బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ షరతులు లేని జీవనభృతి అమలు చేయాలన్నారు. కార్యక్రమాల్లో లక్ష్మి, బేబీ, మీనా, విజయ, గంగాధర్‌, రాములు, భారతి, రుక్మ, హుస్సేన్‌, రాజ్‌సింగ్‌, లతీఫ్‌, యోగేష్‌, గంగాధర్‌, రామ్‌సింగ్‌, నర్సయ్య, సురేశ్‌, నయీమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement