చైర్మన్‌గిరీపై హస్తం గురి | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌గిరీపై హస్తం గురి

Feb 8 2026 3:56 AM | Updated on Feb 8 2026 3:56 AM

చైర్మ

చైర్మన్‌గిరీపై హస్తం గురి

● చేసిన అభివృద్ధి పనులతో ప్రజల్లోకి.. ● ప్రచార సరళిపై సీఎం ఆరా.. ● కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

నిర్మల్‌
ఎన్నికల ఉపాధి
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో యువతీ, యువకులు, రోజు వారి కూలీలకు ఉపాధి లభిస్తోంది. ప్రచారంతోపాటు పోల్‌ చీటీల పంపిణీకి ఉపయోగిస్తున్నారు.

నిర్మల్‌: ‘గాడిదకు గడ్డేసి.. ఆవు పలు పిండితే రావు.. ఓట్లు ఇతర పార్టీలకు వేసి.. అభివృద్ధి కాంగ్రెస్‌ చేయాలంటే జరగదు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి.. అభివృద్ధి చేసుకోండి’ ఇదీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి నినాదం. ‘ప్రభుత్వం మనది–పట్టణం మనది–ప్రగతీ మనది’ అన్న నినాదంతో ఈసారి పురాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో పార్టీ జెండా ఎగురవేసేందుకు శ్రమిస్తోంది. ప్రధానంగా నిర్మల్‌లో ఈసారి ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి అప్పాల కావ్య, గణేశ్‌చక్రవర్తి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాము పోటీచేస్తున్న వార్డుల్లోనే కాకుండా పట్టణంలోని ప్రతీ వార్డు, ప్రతీ ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీమంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌అలీకూడా నిర్మల్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ చేతిగుర్తును తీసుకెళ్తున్నారు. పార్టీని గెలిపిస్తే, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు.

గతంలో చేసిన పనులతో..

నిర్మల్‌ మున్సిపాలిటీలో 2014–19 వరకు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులను మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, 37వవార్డు అభ్యర్థి అప్పాల గణేశ్‌చక్రవర్తి ప్రచారం చేస్తున్నారు. ఈసారి నిర్మల్‌ మున్సిపాలిటీ పీఠం బీసీ మహిళకు రావడంతో తన భార్య కావ్యను 36వ వార్డు నుంచి బరిలో నిలిపారు. ఈ రెండువార్డులతోపాటు మిగితా 40 వార్డుల్లోనూ తమ హయాంలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు. మార్నింగ్‌వాక్‌ ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం, కోతుల సమస్యను అరికట్టడం, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడటం, వీధుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం ఇలా తాము చేసిన పనులను ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ఈసారి అవకాశమిస్తే రాష్ట్రప్రభుత్వ సహకారంతో నిర్మల్‌ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామంటున్నారు.

కమిట్‌మెంట్‌తో కాంగ్రెస్‌..

సీఎం ఫోకస్‌..

సీఎం రేవంత్‌రెడ్డి ఈసారి ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. బీజేపీ ప్రభావం ఉన్న నిర్మల్‌లో గెలువాలంటూ పార్టీ సీనియర్లు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పట్టణంపై అప్పాల గణేశ్‌చక్రవర్తికి పట్టు ఉండటంతో కచ్చితంగా గెలిచేలా అందరూ కృషిచేయాలని ఇటీవల నిర్మల్‌ పర్యటన సందర్భంగా సీనియర్‌ నేదలకు సూచించారు. తాజాగా ప్రచార సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

అధికార కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతోపాటు జిల్లాలో ఖానాపూర్‌ మినహా మిగిలిన రెండు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేయడంతో ఈసారి ఎలాగైన మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలని చూస్తోంది. ఖానాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్‌ పూర్తి సమయం కేటాయించి గెలుపు కోసం కృషిచేస్తున్నారు. భైంసాలోనూ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావుపటేల్‌, విఠల్‌రెడ్డి అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

చైర్మన్‌గిరీపై హస్తం గురి1
1/3

చైర్మన్‌గిరీపై హస్తం గురి

చైర్మన్‌గిరీపై హస్తం గురి2
2/3

చైర్మన్‌గిరీపై హస్తం గురి

చైర్మన్‌గిరీపై హస్తం గురి3
3/3

చైర్మన్‌గిరీపై హస్తం గురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement