సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
లక్ష్మణచాంద: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిర్మల్‌లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి జూడో పోటీల్లో లక్ష్మణచాంద కేజీబీవీకి చెందిన గంగోత్రి, తేజశ్రీ, జాహ్నవి, సుప్రియ, బిందూర, అపర్ణ, విశ్వశ్రీ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్యారమ్స్ సింగిల్స్‌లో నవ్య కుమారి, డబుల్స్‌లో నవ్యకుమారి, నిశిత రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. కరాటేలో రిశిక, పూజిత రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులను ఎస్‌వో నవిత, ఉపాధ్యాయులు అభినంధించారు.
ముధోల్ శిశుమందిర్ విద్యార్థులు..
ముధోల్: ముధోల్ శ్రీసరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు సీఎంకప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానాచార్యులు సారథిరాజు తెలిపారు. జిల్లాస్థాయి ట్రియల్‌తోన్‌లో రమ్మెల్ల యోగిత ప్రథమ స్థానం, 3వేల మీటర్ల రన్నీంగ్‌లో బొడ్డోల్ల సాత్విక్ ప్రథమ, 400 మీటర్ల రన్నింగ్‌లో అంకంవార్ సాత్విక ప్రథమ, 1500 మీటర్లలో రన్నింగ్‌లో కోరి సాత్విక ద్వితీయ స్థానం, జావెలిన్‌త్రోలో శైలజ ప్రథమ, చక్రవం విసరడంలో ఆర్.సాత్విక్ ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని వివరించారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


