ఆఖరి పోరాటం
న్యూస్‌రీల్
నిర్మల్
ఇక్కడకాదు.. అక్కడ!
మున్సిపల్ ప్రచారం తుది అంకంలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఓటర్లు ఇతర వార్డుల్లో ఉంటున్నారు. వారిని రప్పించేందుకు అభ్యర్థులుపాట్లు పడుతున్నారు.
ముందే ఓటేశారు..
నిర్మల్‌ఖిల్లా/నిర్మల్ రూరల్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 11వ తేదీన జరుగనుంది. కానీ వీరు మూడు రోజుల ముందే ఓటేశారు. అందేటి అనుకుంటున్నారా.. కానీ నిజమే.. పోలింగ్ రోజున విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది మూడు రోజుల ముందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల సిబ్బంది ఫారం–12 నింపి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో ఓటరుగా నమోదైన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖానాపూర్, నిర్మల్, బైంసా పరిధిలోని తదితర ప్రాంతాల్లో పోలింగ్ అధికారులుగా విధులు నిర్వహించనున్నారు.
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రచారానికి ఈ ఒక్కరోజే మిగిలింది. దీంతో నిమిషం కూడా వృథా కావొద్దన్నట్లు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. మూడు మున్సిపాలిటీల్లో అన్నిపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సంఘాల వారీగా పిలుస్తూ, కులాలను కలుస్తూ, వర్గాలకు దగ్గరవుతూ అభ్యర్థులందరూ అన్ని రకాలుగా ఓట్లు రాబట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డు బయట ఉన్న ఓటర్ల దగ్గరికి నేరుగా అభ్యర్థే వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ‘ఇంకా ఏమైనా ఇళ్లు మిగిలాయా..! ఇంకా ఏ ఓటరునైనా కలువలేదా..!’ అంటూ మరోసారి ఓటరు లిస్టును చెక్ చేసుకుంటున్నారు. ఏ ఒక్కరినీ వదలకుండా కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పొద్దంతా చేసేది ఒకెత్తయితే, రాత్రివేళ చేస్తున్న ‘విందు ప్రచారం’ మరో ఎత్తు.
తగ్గేదేలే అంటున్న రెబల్స్..
మున్సిపల్ అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి మరికొన్ని గంటలే మిగిలాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటకే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీఎస్పీలతో ఆయా పార్టీల రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులూ ‘తగ్గేదెలే..’ అన్నట్లు వార్డుల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. భైంసాలో రెబల్స్, స్వతంత్రులూ ప్రధాన పార్టీలకు తగ్గకుండా జనసమీకరణ చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు, స్వతంత్రులు ఏ నిమిషమూ వృథా చేయొద్దు అన్నట్లుగా చివరిరోజు షెడ్యూల్ పెట్టుకున్నారు. చివరిరోజు మరోసారి అన్ని ఇళ్లనూ టచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
విందు ప్రచారం..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల దినచర్య ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమవుతోంది. 8 గంటలోపు కార్యకర్తలు, అనుచరులను పిలిపించుకోవడం, వారితో కలిసి టిఫిన్ చేసి వార్డులో ప్రచారానికి వెళ్లడం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓవైపు, లంచ్ తర్వాత ఓ గంట విశ్రాంతి తీసుకుని సాయంత్రం మరోవైపు వెళ్తున్నారు. ఇక రాత్రిళ్లు చేపడుతున్న ‘విందు ప్రచారం’ ప్రభావం వేరే ‘ఎత్తవుతోంది’. జిల్లాకేంద్రంలోని చాలావార్డుల్లో ఆదివారం రాత్రి పోటాపోటీగా అభ్యర్థులు విందులు ఏర్పాటు చేశారు. కొన్నివార్డుల్లో ఓటర్లు ఎటువెళ్లాలో తెలియక తికమకపడ్డారు. ప్రచారం ముగిసినా.. మిగిలిన ఈ రెండురాత్రులూ విందులతో, ప్రలోభాలతో సాగనున్నాయి.
ఆఖరి పోరాటం
ఆఖరి పోరాటం
ఆఖరి పోరాటం
ఆఖరి పోరాటం


