నదము గ్రంథావిష్కరణ
బాసర: ప్రముఖ రచయిత కవి, భీమన్న సాహితీ పీఠం అధ్యక్షులు సుప్పని సత్యనారాయణ రచించిన నదము గ్రంథాన్ని బాసర శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో రాష్ట్ర గేయ రచయిత స్వర్గీయ డాక్టర్ అందెశ్రీ కుమారుడు దత్తసాయి ఆదివారం ఆవిష్కరించారు. అందెశ్రీకి 35 ఏళ్లుగా బాసర క్షేత్రంతో మంచి అనుబంధం ఉందని ఏటా డిసెంబర్ 31న బాసరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్లేవారని గుర్తు చేశారు. వాక్కులమ్మ ప్రచురణలు పేరిట వారి సంకల్పంలో భాగంగా ఇప్పటివరకు 5 పుస్తకాలు ప్రచురించామని, ఆరో పుస్తకంగా నదము గ్రంథం తీసుకువచ్చినట్లు వివరించారు.కార్యక్రమంలో ప్రముఖ ఆర్టిస్ట్ బిక్కనూరి రవి, దాసరి రాజేశ్, సుప్పని సాయి కృష్ణ, బొద్దుల హరికృష్ణ పాల్గొన్నారు.


