కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు అనిల్‌యాదవ్ అన్నారు. పట్టణంలోని 38వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాందేడపు అన్నపూర్ణ తరఫున ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్‌ఎస్ ఏమీ చేయలేదన్నారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరాడు.
ఆదరించండి.. అండగా ఉంటాం
నిర్మల్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలకు అండగా ఉంటామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. పట్టణంలోని 38వ వార్డు అభ్యర్థి పూదరి ఉదయశ్రీ రంజిత్ తరఫున ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీకి పట్టం కట్టి, ఐక్యతను చాటాలని కోరారు. కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సాంఘికశాస్త్రం పరీక్షలో ప్రతిభ
నిర్మల్ రూరల్: రాష్ట్రస్థాయి సాంఘికశాస్త్ర ప్రతి భ పరీక్షలో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచా రు. బోసి ఉన్నత పాఠశాలకు చెందిన డి.అక్షర ఇంగ్లిష్ మీడియం విభాగంలో నాలుగో ర్యాంక్, ఉర్దూ మీడియం విభాగంలో నర్సాపూర్(జి) ఉర్దూ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆఫ్రిన్ రెండో ర్యాంకు సాధించారు. విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అభినందించారు.
క్యారమ్స్‌లో ఎంజేపీ విద్యార్థి ప్రతిభ
ఖానాపూర్: పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి గాండ్ల వర్షిత్ సీఎం కప్ జిల్లాస్థాయి క్యారం పోటీల్లో ప్రతిభ కనబబర్చాడు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో వర్షిత్ రెండోస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి


