ప్రతీ పౌరుడు ఓటుహక్కు వినియోగించుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి సూచిక అని, భారతదేశంలో ఓటు హక్కు అమలైన తీరును వివరించారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, పిల్లలందరికీ చిన్ననాటి నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలపాలన్నారు. అంతకుముందు సమావేశానికి హాజరైన వారితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాలలో పాలుపంచుకున్న విద్యార్థులు, అధికారులకు, క్రమం తప్పకుండా పలు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లను, కలెక్టర్ సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం సైకిల్ ర్యాలీని కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు
లక్ష్మణచాంద: ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గంలో ఉత్తమ ఎలక్టోరల్ అవార్డును లక్ష్మణచాంద తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఎంపికయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ అవార్డు అందించారు. ఇందులో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి ఉన్నారు.


