అభివృద్ధిని చూసే ఓటేసేవారు
నిర్మల్‌చైన్‌గేట్: నేను నిర్మల్ పట్టణంలో బంగల్‌పేట కాలనీ నుంచి మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచాను. ఒకసారి కోఆప్షన్ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారు.1986, 1995లో స్వతంత్ర అభ్యర్థిగా సింహం, ఓడ గుర్తుపై పోటీ చేసి గెలిచాను. 2000లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ సాధించాను. నా హయాంలో మా కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అయ్యన్నగారి భూలక్ష్మి చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో ఖిల్లా గుట్ట నుంచి పైప్‌లైన్ వేయించి బోయవాడ బంగల్‌పేట్ నీటి కష్టాలు తీర్చాం. ప్రభుత్వ పాఠశాల కోసం స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేపట్టాం. కురన్నపేటకు తరలించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బంగల్‌పేట్‌కు మంజూరు చేయించి భవన నిర్మాణానికి కృషి చేశాను. 90 శాతం రోడ్లు, డ్రైనేజీ పనులు నా హయాంలోనే చేశాను.


