వాతావరణం
ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. తెల్లవారుజామున చల్లగా ఉంటుంది.
‘ఫీల్డ్’పై భారం
లోకేశ్వరం: కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో వలసలు తగ్గించి, అన్నదాతకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వీబీజీ రామ్‌జీ(ఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలు చేస్తోంది. పనుల పర్యవేక్షణ, హాజరు నమోదు, కొత్త పనుల గుర్తింపు తదితర పనుల కోసం ప్రతీ పంచాయతీకి ఫీల్డ్ అసిస్టెంట్‌ను(ఏఫ్‌ఏ) నియమించింది. అయితే గత ప్రభుత్వం 500 జనాభా కలిగిన గ్రామాలను పంచాతీలుగా ఏర్పాటు చేసింది. అయితే ఈ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు.
కొత్త పంచాయతీల్లో ఎఫ్‌ఏల కొరత..
కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో క్షేత్ర సహాయకులు లేకపోవడంతో పథక అమలు కష్టంగా మారింది. పనుల గుర్తింపు, హాజరు రికార్డు, పనిస్థలంలో వసతి, వేతనాల చెల్లింపు వంటి బాధ్యతలు భారంగా మారాయి. 204 గ్రామాల్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. మిగిలిన చోట్ల సమస్యలు ఉన్నాయి.
ఎఫ్‌ఏల బాధ్యతలు..
కూలీలకు పనుల కేటాయింపు, మాస్టర్లు వేయడం, పర్యవేక్షణ, జాబ్ కార్డుల మంజూరు, ఆధార్ లింకింగ్, వసతి కల్పన వంటి పనులు ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకోవాలి. వారు లేనిచోట అనుభవజ్ఞులైన కూలీలను మేట్‌లుగా నియమించారు. దీంతో పక్క గ్రామాల ఎఫ్‌ఏలపై అదనపు భారం పడుతోంది.
అమలులో సమస్యలు..
మేట్‌ల అవగాహన కొరతతో తప్పులు జరిగి, సహాయకులు, కార్యదర్శులు ఆడిట్‌లో బాధ్యులవుతున్నారు. పనుల కేటాయింపు, గ్రామ సభలు, హాజరు, వేతన మంజూరులో పర్యవేక్షణ లోపం. జాబ్ కార్డు ధారుకులకు 100 రోజుల పని కల్పనలో వైఫల్యాలు విమర్శలకు గురవుతున్నాయి. పూర్తిస్థాయి సహాయకులను నియమించి శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్ మానిటరింగ్ పెంచడం అవసరం. పంచాయతీల్లో సమన్వయం మెరుగుపరచి, పథకం ప్రయోజనాలను పూర్తిగా చేరవేయాలి.
ఎఫ్‌ఏలను నియమిస్తాం
ఉపాధిహామీ పనులకు ఉమ్మడి జీపీల్లో నియమించిన ఎఫ్‌ఏలు పని చేస్తున్నారు. దీంతో కొంత భారం పడుతున్న మాట వాస్తవమే. కొందరు తమకు తెలియకుండానే అవకతవకలకు బాధ్యులవుతున్నారు. కొత్తగా ఏర్పటు చేసిన జీపీలకు ఎఫ్‌ఏల నియామకానికి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. జీవో వచ్చాక నియామకాలు చేపడుతాం. దీంతో గ్రామాల్లో ఎఫ్‌ఏలపై పని భారం తగ్గుతుందని తెలిపారు.
– విజయలక్ష్మి, డీఆర్డీవో
పూర్తిస్ధాయిలో భర్తీ చేయాలి
గతంలో జోహర్‌పూర్ జీపీ కింద ఐదు గ్రామాలు ఉండేవి. ఇందులో రెండు కొత్తగా జీపీలు ఏర్పడ్డాయి. అర్లి–గొడిసెరా జీపీలో పని జరిగితే 6 కిలో మీటర్లు ప్రయాణం చేసి కూలీల హాజరు తీసుకోవాల్సి వస్తోంది. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ఎఫ్‌ఏ పోస్టు భర్తీ చేయాలి. దీంతో మాపై అదనపు భారం ఉండదు.
– అంజన్‌రెడ్డి, ఎఫ్‌ఏ, జోహర్‌పూర్
జిల్లాలో ఇలా ..
గ్రామ పంచాయతీలు 400
జిల్లాలో మండలాలు 18
క్షేత్రసహాయకులు 204
జాబ్ కార్డులు 1.74 లక్షలు
మొత్తం ఉపాధి కూలీలు 3.20 లక్షలు
క్షేత్ర సహాయకులు లేని జీపీలు 196
వాతావరణం
వాతావరణం


