గెలుపు గుర్రాలకే టికెట్
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ తెలిపారు. పట్టణంలో పార్టీ ఎన్నిల ఇన్‌చార్జి పుల్లారావు యాదవ్‌తో కలిసి మంగళవారం పర్యటించారు. వార్డుల వారీగా సమీక్ష నిర్వహించారు. పోటీ చేస్తామనే ఆశావాహులంతా పార్టీ నియమాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీ తరఫున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో నల్లా రవీందర్‌రెడ్డి, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, మదిరె శ్రీనివాస్, నాయిని సంతోష్, అనిల్‌రావు, తోకల బుచ్చన్నయాదవ్, పడాల రాజశేఖర్, ఎనగందుల నారాయణ, ఆసం సాయికృష్ణ, సందుపట్ల శ్రావణ్, బొప్పారపు సత్యవతి, రాపెల్లి రవీందర్, మంత్రరాజం సురేశ్, మట్టేరి రాజశేఖర్, కాశవేణి ప్రణయ్, ఎనగందులకుమార్, నరవేని సాయి, దానిపెల్లి సుధాకర్ పాల్గొన్నారు.


