ఢిల్లీ ధర్నాకు వెళ్లిన ఉపాధ్యాయులు
నిర్మల్ రూరల్: సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు జిల్లా నుంచి ఎస్టీయూ ఉపాధ్యాయులు బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు ఈనెల 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏఐఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానాన్ని పునఃపరిశీలించాలనే డిమాండ్లతో ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్‌రావు, నాంపల్లి నాగభూషణ్, రాజారెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, వివిధ మండల బాధ్యులు పాల్గొన్నారు.
ఢిల్లీకి వెళ్తున్న ఉపాధ్యాయులు


