విద్యార్థులకు నాయకత్వ పాఠాలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాయకత్వ పాఠాలు

Feb 8 2026 3:56 AM | Updated on Feb 8 2026 3:56 AM

విద్యార్థులకు నాయకత్వ పాఠాలు

విద్యార్థులకు నాయకత్వ పాఠాలు

● ప్రభుత్వ పాఠశాలల్లో హౌస్‌ సిస్టమ్‌ ● ఒక్కో పాఠశాలకు రూ.6,350 నిధులు

లక్ష్మణచాంద: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో చదివే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించింది. పాఠశాలల్లో హౌస్‌ సిస్టంను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థులు పాఠశాలస్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటారు. ఇందుకు ప్రతీ పాఠశాలకు రూ.6,350 ప్రత్యేక గ్రాంట్‌ కేటాయించి, కార్యక్రమం పకడ్బందీగా అమలు అవుతోంది.

జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య..

జిల్లాలో 577 ప్రాథమిక పాఠశాలల్లో 23,398 మంది, 89 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,373 మంది, 164 ఉన్నత పాఠశాలల్లో 37,019 మంది చదువుతున్నారు. ఇక 18 కేజీబీవీల్లో 3,600 మంది విద్యార్థులు ఈ వ్యవస్థ పాల్గొంటున్నారు. అన్ని పాఠశాలల్లో హౌస్‌ల స్థాపన పూర్తయింది.

హౌస్‌లకు దేశ నాయకుల పేర్లు..

ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో నాలుగు హౌస్‌లు ఏర్పాటు చేశారు. రెడ్‌ హౌస్‌(అబ్దుల్‌ క లాం), గ్రీన్‌ హౌస్‌(శకుంతలా దేవి), బ్లూ హౌస్‌ (సీవీ.రామన్‌), ఎల్లో హౌస్‌(రవీంద్రనాథ్‌ ఠాగూర్‌) పేర్లు. ప్రతీ హౌస్‌కు ఉన్నత తరగతి నుంచి కెప్టెన్‌, టీచర్‌ మాస్టర్‌ లేదా హౌస్‌ మదర్‌ను నియమిస్తారు.

హౌస్‌ విధులు ఇవీ..

ప్రతీ హౌస్‌కు 15 రోజులు కేటాయించారు. ఆ కాలంలో ఆ హౌస్‌ సభ్యులు ఉదయం ప్రార్థన, మధ్యాహ్న భోజనం, క్లీనింగ్‌, వ్యక్తిగత పరిశుభ్రత వంటి పాఠశాల కార్యకలాపాలను నడుపుతారు. విద్యార్థి కౌన్సిల్‌లో హెడ్‌ బాలుడు, హెడ్‌ బాలిక, డిప్యూటీలు, ఆరు క్లబ్‌ల సెక్రెటరీలు(ఎకో, జీసీఈఏసీ, పహరీ, డిజిటల్‌, లైబ్రరీ, స్పోర్ట్స్‌) ఎంపిక అవుతారు.

ప్రోత్సాహకాలు..

ఉత్తమ హౌస్‌లకు బహుమతులు, షూస్‌, బ్యాడ్జీ లు, క్రీడా పరికరాలు అందిస్తారు. పాఠశాల కార్యక్రమాలన్నీ ఈ కమిటీలే నిర్వహిస్తాయి. ఇవి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభిమానం పెంచుతుందని ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement