నిబద్ధతతో విధులు నిర్వహించాలి
న్యూస్‌రీల్
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను గౌరవిస్తూ.. ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 77వ గణ తంత్ర దినోత్సవాన్ని సోమవారం నిర్వహించా రు. ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయ సేవలు అందించడమే పోలీస్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, సాయికిరణ్, ఎస్సైలు ఆర్‌ఎస్సైలు, పోలీస్, డీపీవో పాల్గొన్నారు.
10న బాసర హుండీ లెక్కింపు
బాసర: బాసర అమ్మవారి ఆలయ హుండీలను ఫిబ్రవరి 10న లెక్కించనున్నట్లు ఈవో అంజనాదేవి తెలిపారు. మొదట ఈనెల 28 లెక్కించాలని నిర్ణయించారు. అనివార్య కారణాలతో 10వ తేదీకి వాయిదా వేశారు.


