నిర్మల్‌కు అమిత్ షా..?
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈనెల 8 లేదా 9 తేదీల్లో నిర్మల్‌కు రానున్నట్లు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్‌తో కలిసి సభ ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రావుల రాంనాథ్ పాల్గొన్నారు.


