ఆశ నిరాశల పద్దు | - | Sakshi
Sakshi News home page

ఆశ నిరాశల పద్దు

Feb 2 2026 7:17 AM | Updated on Feb 2 2026 7:17 AM

ఆశ ని

ఆశ నిరాశల పద్దు

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ● బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌

న్యూస్‌రీల్‌

జిల్లాకో బాలికల వసతిగృహం

కొత్త రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు

ఆర్మూర్‌–ఆదిలాబాద్‌ లైన్‌పై స్పష్టత కరువు

సామాన్య, మధ్యతరగతి ప్రజల నిట్టూర్పు

ఉద్యోగవర్గాల్లోనూ అసంతృప్తి

నిర్మల్‌

కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర

నిర్మల్‌రూరల్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగా విచారణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వేధిస్తోందని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ నాయకులు జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ కి కాలం చెల్లేరోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రామ్‌కిషన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు తుల శ్రీనివాస్‌, సుభాష్‌రావు, అయ్యన్నగారి రాజేందర్‌, భూషణ్‌రెడ్డి, శంకర్‌ యాదవ్‌, రిజ్వాన్‌ఖాన్‌, మహేష్‌రెడ్డి, గండ్రత్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

నిర్మల్‌: ‘ఈసారి ఇన్‌కంట్యాక్స్‌లో ఏమైనా మార్పులు చేస్తారేమో.. మాకేమైనా లాభం జరుగుతుందేమో అనుకున్నం. కానీ ఈసారి ఎలాంటి మార్పులూ చేయలేదు..’ అంటూ పన్ను చెల్లింపుదారులు నిట్టూర్చారు. ‘బేటీ బచావో–బేటీ పడావో’ అంటూ నినదిస్తున్న కేంద్రం ఆడపిల్లల చదువులకు మరో ముందడుగు వేసింది. జిల్లాకు ఒక బాలికల వసతిగృహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇలా.. నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ఆశ నిరాశల మధ్య సాగింది. నేరుగా జిల్లాకు పెద్దగా లబ్ధి చేకూరే అంశాలు లేవు. కొత్త రైల్వేలైన్‌ల నిర్మాణానికి నిధుల కేటాయింపు బాగున్నా.. అందులో జిల్లా మీదుగా లైన్‌ నిర్మాణం ఉందా? లేదా.. అన్న స్పష్టత రావాల్సి ఉంది.

రైల్వేలైన్‌పై నోక్లారిటీ..

ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ రైల్వే బడ్జెట్‌లో రూ.2,77,830 కేటాయించారు. ఇందులో రూ.36,721కోట్లను కొత్త రైల్వేలైన్‌ల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధుల్లో ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ లైన్‌ ఉందా? లేదా అనే స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే డీపీఆర్‌పూర్తయ్యింది. దక్షిణమధ్య రైల్వే 136.50 కిలోమీటర్ల ఆర్మూర్‌–నిర్మల్‌–ఆదిలాబాద్‌ లైన్‌ నిర్మాణానికి రూ.4,300 కోట్ల అంచనాతో ఈ డీపీఆర్‌ పూర్తి చేసింది. సోన్‌ వద్ద గోదావరిపై బ్రిడ్జితో పాటు ఘాట్‌రోడ్లలో ఎనిమిది చోట్ల టన్నెళ్ల నిర్మాణాలను చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇప్పటికే రైల్వేశాఖకు చేరింది.

మార్పులు, చేర్పుల్లేవ్‌

ఈసారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవు. ఆదాయపన్ను స్లాబుల్లోనూ ఎలాంటి మార్పులు లేవు. సవరించిన పన్ను విధానమే వర్తింపు చేయనున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలు ఆశించినవి బడ్జెట్‌లో కనిపించలేదు. – భూమన్న యాదవ్‌, ఎకానమిస్ట్‌

ఐటీచెల్లింపు గడువు పెంచారు..

ఈసారి బడ్జెట్‌లో ఆడిట్‌ అవసరం లేని వ్యాపారులకు నెల గడువు పెంచారు. గతంలో జులై 31వరకు ఉండేది. ప్రస్తుతం ఆగస్టు 31 వరకు పొడగించారు. ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–2 ఫైల్‌ చేసేవాళ్లకు జులై 31 వరకు గడువు ఉంటుంది.

– ముక్క సాయిప్రసాద్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌

జిల్లాకు ఏమిస్తారు..!

సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

వరుసగా రెండుసార్లు ఎంపీలను, భారీ మెజార్టీతో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ గెలిపించినా కేంద్రం నిర్మల్‌ ప్రాంతంపై ఇంకా శీతకన్ను చూస్తోందన్న వాదన ఉంది. రైల్వేలైన్‌ అంశాన్ని పక్కనపెడితే, మిగితా ఏరంగంలోనూ కేంద్రం నుంచి నేరుగా మన ప్రాంతానికి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు అందలేదు. ఈసారి బడ్జెట్‌లో పలు పరిశ్రమలు, సంస్థల ఏర్పాటును కేంద్రమంత్రి ప్రకటించారు. ఇందులో కనీసం ఒకట్రెండైనా జిల్లాకు కేటాయించాలన్న డిమాండ్‌ వస్తోంది. ప్రజామోదంతో పరిశ్రమలు, బాసర యూనివర్సిటీ, నవోదయ, సైనిక్‌ విద్యాలయాల ఏర్పాటుపై ఈసారైనా దృష్టిపెట్టాలంటున్నారు. ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్న ఎన్‌హెచ్‌ 61విస్తరణను పూర్తిచేయాల్సిన అవసరమూ ఉందంటున్నారు.

ఆశ నిరాశల పద్దు1
1/3

ఆశ నిరాశల పద్దు

ఆశ నిరాశల పద్దు2
2/3

ఆశ నిరాశల పద్దు

ఆశ నిరాశల పద్దు3
3/3

ఆశ నిరాశల పద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement