కౌన్సిలర్‌ నుంచే ‘గోనె’ ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్‌ నుంచే ‘గోనె’ ప్రస్థానం

Feb 1 2026 6:31 AM | Updated on Feb 1 2026 6:31 AM

కౌన్సిలర్‌ నుంచే ‘గోనె’ ప్రస్థానం

కౌన్సిలర్‌ నుంచే ‘గోనె’ ప్రస్థానం

కాంగ్రెస్‌ నుంచి గోనె హన్మంతరావు రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1961 ఎన్నికల్లో పాతమంచిర్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1967లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. 1987లో కాసిపేట మండలం ముత్యంపల్లి నుంచి సింగిల్‌ విండో చైర్మన్‌గా గెలిచారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ పదవిని అలంకరించారు. 1989లో లక్సెటిపేట(ప్రస్తుతం మంచిర్యాల) నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్‌ కోసం విఫలయత్నం చేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టికెట్‌ లభించగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 1999, 2010లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు. రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన అనారోగ్యంతో మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement