ఎట్టకేలకు కేజీబీవీలకు గీజర్లు
లక్ష్మణచాంద: చలికాలంలో వణికే చలిలో చన్నీటి స్నానాలు చేశారు కేజీబీవీ విద్యార్థులు. కొందరు రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ అభిలాష అభినవ్ గీజర్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. మూడు నెలల క్రితమే పాఠశాలలకు గీజర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం చలికాలం ముగింపు దశకు వచ్చాక మంజూరు చేసింది.
ఎన్నికల కారణంగా ఆలస్యం
చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నవంబర్ మొదటి వారంలోనే కేజీబీవీలకు గీజర్లు అందించాల్సి ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల కారణంగా కొంత ఆ లస్యం అయిందని విద్యాశాఖ అధికారులు తెలిపా రు. జిల్లాలోని 18 కేజీబీవీలు ఉండగా, ఒక్కో విద్యాలయానికి నాలుగు గీజర్లు సరఫరా చేశారు.
రూ.18 లక్షలతో పూర్తి సరఫరా
ఒక్కొక గీజర్ 25 లీటర్ల సామర్థ్యం కలిగినది. ధర రూ.25 వేలు. ఒక కేజీబీవీకి నాలుగు గీజర్లకు రూ.లక్ష చొప్పున, మొత్తం 18 కేజీబీవీలకు రూ.18 లక్షలు వెచ్చించారు. ఇప్పటికే అన్ని విద్యాలయాలకు గీజర్లు చేరాయి.
బాలికల ఆనందం..
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల బాలికలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు గీజర్లతో ఆ సమస్య పూర్తిగా తొలగిపోయింది. విద్యార్థినులు ఈ సౌకర్యంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
జిల్లా సమాచారం...
జిల్లాలోని మొత్తం కేజీబీవీలు 18
గీజర్లు వచ్చిన కేజీబీవీలు 18
ఒక్కో దానికి అందించిన గీజర్లు 04
ఒక్కో దాని ధర రూ.25 వేలు
ఒక యూనిట్ ధర రూ.లక్ష


