భారత్ పర్వ్–2026కు ఎంపిక
కోటపల్లి: గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఈనెల 26 నుంచి 31 వరకు నిర్వహించే భారత్ పర్వ్–2026కు మండలంలోని కొల్లూర్‌కు చెందిన నిమ్మల విజయ్‌కుమార్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులు, కళలు, వారసత్వాన్ని చాటిచేప్పే భారీ ప్రదర్శనలో రాష్ట్రం తరపున జానపద నృత్యాలు ప్రదర్శించనున్నారు. గ్రామస్తులు, నాయకులు విజయ్‌కుమార్‌ను అభినందించారు.
పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంప్
బోథ్: ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి ఔత్సాహికులు పొచ్చెర జలపాతం వద్ద వింటర్ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ పులుల గణనలో భాగంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వలంటీర్లు, నేచర్ సొసైటీ సభ్యులు ప్రత్యేకంగా నైట్ క్యాంపు ఏర్పాటు చేశారు. రాత్రంతా అక్కడే బస చేశారు. ఉదయం అటవీ అందాలు, జలపాతాలను చూసి వలంటీర్లు అబ్బురపడ్డారు. పొచ్చెర జలపాతం వద్ద సహజ సిద్ధమైన ప్రకృతిని చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ పర్వ్–2026కు ఎంపిక


