కాంగ్రెస్‌తోనే బీజేపీకి పోటీ
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీకి పోటీ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణాలతోపాటు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలతోపాటు పట్టణాలకు నిధుల కేటాయింపు శూన్యమన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాటీల్లో బీజేపీ కై వసం చేసుకుంటుందన్నారు. ఈ సందర్భం బీఆర్‌ఎస్ పార్టీ 12వ వార్డు ఇన్‌చార్జి బండిపెల్లి ప్రకాశ్‌గౌడ్ సుమారు 50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరారు. రితీశ్ రాథోడ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, అంకం మహేందర్, మంత్రరాజం సురేశ్, నల్ల రవీందర్‌రెడ్డి, కీర్తి మనోజ్, ఎనగందుల నారాయణ, పుప్పాల ఉపేందర్, మట్టెరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


