ఆ రైళ్లు ఆగేదెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

ఆ రైళ్లు ఆగేదెప్పుడో..!

Jan 26 2026 4:06 AM | Updated on Jan 26 2026 4:06 AM

ఆ రైళ్లు ఆగేదెప్పుడో..!

ఆ రైళ్లు ఆగేదెప్పుడో..!

● సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ● మంచిర్యాలలో హాల్టింగ్‌పై ఉదాసీనత ● రైళ్లకు బోగీపెంపులేక ప్రయాణికుల ఇక్కట్లు ● ప్రజాప్రతినిధులు స్పందిస్తేనే మేలు మంచిర్యాలఅర్బన్‌: నాన్‌ సబర్మన్‌ గ్రేడ్‌ (ఎన్‌ఎస్‌జీ) ‘3’గుర్తింపు కలిగిన మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల నిలుపుదల ప్రయాణికులకు నిరాశ మిగుల్చుతోంది. ఏళ్ల తరబడి రైల్వే ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. రైళ్లకు బోగీల పెంపునకు ప్రయాణికులు ఇక్కట్లు తప్పడం లేదు. కేరళ ఎక్స్‌ప్రెస్‌కు కాగజ్‌నగర్‌లో నిలుపుదలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించగా, మంచిర్యాలకు చోటుదక్కకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. బోగీల పెంపు బోధపడేదెన్నడో? కిక్కిరిసిపోయే జనాలు, ఇరుకుదారులు..వాసనొచ్చే మరుగుదొడ్లు..నిల్చోవడానికి కూడా లేని పరిస్థితి. జనరల్‌ బోగీలో ప్రయాణ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ 17011/12 హైదరాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి బీదర్‌లో కేవలం 6 జనరల్‌ బోగీలు, 5 సెకండ్‌ సిటింగ్‌ రిజర్వేషన్‌, 2 చైర్‌కార్‌, 2ఎస్‌ఎల్‌ఆర్‌ వికలాంగుల, మహిళ బోగీలున్నాయి. మొత్తం 15 ఉన్నాయి. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు ఉండాలి. ప్రస్తుతం మరో జనరల్‌ బోగీలు జతచేస్తే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12758/57) సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు 15 జనరల్‌, 3 సెకండ్‌ సీటింగ్‌ రిజర్వేషన్‌, 1 చైర్‌కార్‌, 1 ఎసీ ఎకనామీ, 1 ఎస్‌ఎల్‌ఆర్‌లో 22 బోగీలున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌తో పోల్చితే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ స్టాఫ్‌లు ఎక్కువ. ఉదయం భాగ్యనగర్‌ తర్వాత మధ్యాహ్నం ఇంటర్‌సిటీ వరకు ఒక్క రైలు హైదరాబాద్‌ వైపు లేదు. వందేభారత్‌ ఉన్నప్పటికీ అది ప్రీమియం రైలు. ఢిల్లీ–హైదరాబాద్‌ తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం 4 మాత్రమే సాధారణ బోగీలుంటాయి. ఇందులో వేలాడుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. మంచిర్యాలలో నిలుపుదల, రైళ్లకు బోగీల పెంపు తదితర విషయాలపై దృష్టిపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మంచిర్యాలలో హాల్టింగ్‌ ఏది?

మంచిర్యాలలో కేరళ ఎక్ర్‌ప్రెస్‌ హాల్టింగ్‌ లేదు. పక్కనే ఉన్న రామగుండంలో దాదాపు అన్ని రైళ్లకు నిలుపుదల సౌకర్యం ఉన్నా ఇక్కడ లే దు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో న్యూ ఢిల్లీ నుంచి తిరువనంతపురం సెంట్రల్‌ నుంచి న్యూఢిల్లీ కేరళ (12626/25) రైలు హాల్టింగ్‌ (స్టాఫ్‌నకు) గ్రీన్‌సిగ్నల్‌ లభించగా గత ద శాబ్దంగా డిమాండ్‌ చేస్తున్నా మంచిర్యాలలో హాల్టింగ్‌ ఎటూ తేలకుండా పోయింది. కాజీ పేట, వరంగల్‌ రైల్వేస్టేషన్ల తర్వాత అధిక ఆదాయం ఉన్నా ఇక్కడ రైళ్ల నిలుపుదలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఆదిలాబాద్‌ ఎంపీ, సిర్పూర్‌ ఎమ్మెల్యే చొరవతోనే కాగజ్‌నగర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. వందేభారత్‌ హాల్టింగ్‌ తమదేనంటూ పోటీపడి ఊదరగొట్టిన ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు కేరళ ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదలపై నోరు మెదపకపోవడంపై తప్పుబడుతున్నారు. కేరళ రైలు హాల్టింగ్‌తో శబరిమల, తిరుపతి వెళ్లేందుకు సౌకర్యంగా మారనుంది. చైన్నె సెంట్రల్‌ నుంచి భగత్‌కి కోటి (రాజస్థాన్‌) వరకు నడుస్తున్న రైలు, విజయవాడ రూట్లలో నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌, హంసఫర్‌, పూరి–కాజీపేట్‌ తదితర రైళ్లకు హాల్టింగ్‌కు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

ఆదాయం ఉన్నా రైళ్లేవి?

ఆదాయం ఉన్నా మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో ఆ రైళ్ల నిలుపుదల సంఖ్య తక్కువే. ఇక్కడ స్టాఫ్‌ ఉన్నా తక్కువ రైళ్లతోనే ప్రయాణికుల నుంచి ఆదాయం అధికంగా వస్తున్నట్లు తెలు స్తోంది. 2024–25లో రైల్వే వార్షిక ఆదాయపరంగా చూస్తే దాదాపు మంచిర్యాల రైల్వేస్టేషన్‌ రూ.21 కోట్లతో ఎన్‌ఎస్‌జీ–3 కేటగిరిలో చోటు లభించింది. రామగుండానికి రూ.15 కోట్లు, పెద్దపల్లి జంక్షన్‌కు రూ.11 కోట్లు, సిర్పూర్‌కు రూ.11 కోట్లతో ఎన్‌ఎస్‌జీ–4వ కేటగిరి లో చోటు దక్కింది. తక్కువ ఆదా యం ఉన్నా బెల్లంపల్లికి 5వ కేటగిరి పరిగణిస్తున్నారు. ఎన్‌ఎస్‌జీ–4వ గ్రేడ్‌ రైల్వేస్టేషన్‌ సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో 124 రైళ్ల హాల్ట్‌ ఉన్నప్పటికి దాదాపు రూ.11 కోట్లు కాగా, మంచిర్యాలలో 83 రైళ్ల హాల్ట్‌తో రూ.20 కోట్లపై ఆ దాయం ఉన్న అనుకున్నమేర హాల్టింగ్‌ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పనులతో రద్దు..జాతరకు ప్రత్యేక రైళ్లు!

మంచిర్యాలఅర్బన్‌: మేడారం జాతర వేళ రైల్వేశా ఖ నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల నుంచి మే డారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈనెల 28, 30 ఫిబ్రవరి 1 తేదీ ల్లో మంచిర్యాల నుంచి మధ్యాహ్నం 3.30 గంట లకు బయల్దేరి రాత్రి 10.10 గంటలకు సి కింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 28, 30, ఫిబ్రవరి 1 తేదీ ల్లో ఉదయం 5.45 గంటలకు అక్కడి నుంచి బ యల్దేరి మధ్యాహ్నం 1.30గంటలకు మంచి ర్యాలకు చేరుకోనుంది. జనసాధారణ్‌ పేరుతో రైలు లో రిజర్వేషన్‌ బోగీలు ఉండవని ప్రకటించింది. 29, 31 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ కు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి కాగజ్‌నగర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. తిరిగి కాగజ్‌నగర్‌ నుంచి మధ్యాహ్నం 2.20 బయల్దేరి సికింద్రాబాద్‌ కు రాత్రి 10.10 గంటలకు చేరుకుంటుందన్నారు.

ఇంటర్‌ లాకింగ్‌ పనులతో రైళ్లు రద్దు

మందమర్రి నుంచి బెల్లంపల్లి మధ్య 10 కి.మీ మూడవ రైల్వే మార్గం అందుబాటులోకి తీసుకురావడానికి నాన్‌, ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని పాక్షికంగా, ఇంకొన్ని దారిమళ్లించి ప్రయాణికులు ప్రత్నామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ద.మ. రైల్వే జోన్‌ అఽధికారులు సూచించారు. ఈనెల 24 నుంచి 17003 కాజీపేట్‌ నుంచి సిర్పూర్‌ టౌన్‌, 17004 బల్లార్షా నుంచి కాజీపేట్‌ రామగిరి మెము ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 14వ తేదీ వరకు రద్దు చేశారు. ఈనెల 23 నుంచి ఫిబ్రవరి 13 వర కు 17035 కాజీపేట్‌ నుంచి బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌, ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17036 బల్లార్షా నుంచి కాజీపేట్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు 17033 భ ద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా, 17034 సిర్పూ ర్‌ టౌన్‌ నుంచి భద్రాచలం రోడ్డు వరకు నడిచే సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌ నుంచి బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌ నుంచి వరంగల్‌ మధ్య పాక్షికంగా రద్దయింది. వరంగల్‌ నుంచి భద్రాచలం వరకు యధాతథంగా నడస్తుందని అఽధికా రులు తె లిపారు. బోధన్‌–కరీంనగర్‌–సిర్పూర్‌టౌన్‌ ప్యా సింజర్‌ రైలు ఫిబ్రవరి 14 వరకు రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement