రాజ్యాంగ రథయాత్ర
నిర్మల్‌టౌన్: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో రాజ్యాంగ రథయాత్ర నిర్వహించారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు భారత రాజ్యాంగ విలువలు తెలుసుకుని, పూలే, అంబేడ్కర్, కాన్షీరాం మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, జిల్లా అధ్యక్షుడు సాయన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ పోశెట్టి, గౌరవ అధ్యక్షుడు బర్మ చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి రాజులదేవి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


