కోర్టు ఆవరణంలో గణతంత్ర వేడుకలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో 77వ గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీవాణి జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, న్యాయవాదులు రాజశేఖర్, రమణ తదితరులు పాల్గొన్నారు
మున్సిపల్
కార్యాలయంలో..
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జెండాను ఆవిష్కరించి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్వో రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


