మార్పు చూపిస్తాం
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ అ భ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి పాలించే అవకాశం ఇస్తే మార్పు చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్ధులతో కలిసి బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాకేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయశంకర్ సర్కిల్లో కార్న ర్ మీటింగ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అవినీతిరహిత పాలన అందిస్తామని, అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని తెలిపారు.
ఆ పార్టీలకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మైనార్టీలతోనే అని సీఎం ప్రకటించారని అందుకే బీజేపీ రేవంత్‌రెడ్డిని రేవంతుద్దీన్ అని పిలుస్తోందన్నారు. ఎన్ని షేర్వాణీలొచ్చినా 32 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి బస్వపురం లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


