కేంద్రం నిధులతోనే పట్టణాభివృద్ధి
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గొడెం నాగేష్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్‌తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసింది శూన్యమన్నారు. ఖానాపూర్‌ను మున్సిపాలిటీగా చేసి పన్నులు పెంచారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఖానాపూర్‌లో ఉపాధి హామీ పనులు ప్రారంభించేలా కృషిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మున్సిపాలిటీలకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి అంకం మౌనిక మహేందర్, 1వ వార్డు అభ్యర్థి బత్తుల లక్ష్మీనారాయణ, 3వ వార్డు అభ్యర్థి ఆకుల శోభ శ్రీనివాస్, 4వ వార్డు అభ్యర్థి గుమ్ముల అశోక్, 11వ వార్డు అభ్యర్థి ఎనగందుల నారాయణ, నాయకులు పాల్గొన్నారు.


