నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’ | - | Sakshi
Sakshi News home page

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’

Feb 1 2026 6:31 AM | Updated on Feb 1 2026 6:31 AM

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ‘నడిపెల్లి’

నడిపెల్లి దివాకర్‌రావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కిరాణ దుకాణ వ్యాపారిగా, ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేశారు. 1981లో మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి 7వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు. 1987లో మంచిర్యాల సింగిల్‌ విండో చైర్మన్‌గా పోటీచేసి విజయం సాధించారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలోనే 1999లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో టికెట్‌ లభించింది. విజయం సాధించిన ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో ఓటమి చెందారు. తిరిగి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మూడోసారి, 2018లో ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నేతగా చురుగ్గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement