నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Feb 1 2026 6:31 AM | Updated on Feb 1 2026 6:31 AM

నిర్మ

నిర్మల్‌

ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ● జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకీషర్మిల ● అండర్‌ ట్రయల్‌ ఖైదీల కేసులపై సమీక్ష ●

న్యూస్‌రీల్‌

వార్డుల్లో బుజ్జగింపుల పర్వం రెబల్స్‌, పోటీదారులతో సంప్రదింపులు పార్టీ పెద్దలతో ఫోన్లు.. తాయిలాలు ఇచ్చేందుకూ సై.. 3 వరకు ఉపసంహరణ గడువు

పెండింగ్‌ కేసులు పూర్తి చేయాలి

నిర్మల్‌టౌన్‌: అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు సంబంధించిన కేసుల స్థితిగతులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరగా పూర్తిచేసి, చార్జిషీటు దాఖలు చేయాలని జిల్లా జడ్జి శ్రీవాణి, ఎస్పీ జానకీ షర్మిల పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో అండర్‌ ట్రయల్‌ ఖైదీల కేసులపై శనివారం సమీక్ష నిర్వహించారు. అనవసరంగా ఖైదీలు జైల్లో ఉండకుండా.. న్యాయపరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అలాగే చట్టపరమైన అర్హత ఉన్న, ఖైదీలకు బెయిల్‌, విడుదల వంటి అంశాలను కూడా పరిశీలించాలని తెలిపారు. న్యాయ సూత్రాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, డిస్ట్రిక్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ రాధిక, ఆర్డీవో రత్నకళ్యాణి, పోలీస్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌: ‘తమ్మీ.. ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్‌ ఇయ్యే.. గెలిచినంక ఎట్లయితే అట్లా. వార్డు మొత్తం నువ్వే చూసుకో. ఇద్దరం ఒకే పార్టోళ్లం. నువ్వొక్కడివి పోటీ నుంచి తప్పుకుని నాకు సహకరిస్తే నేను గెలుస్త.. జర ఈసారి బెట్టు చేయకు తమ్మీ’ అంటూ సొంత పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. వార్డు పెద్దలతోపాటు పార్టీ సీనియర్‌ నేతలతోనూ వారి ఇంటికి తీసుకెళ్లి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిస్తే తన మాట వింటాడోనని సదరు రెబల్స్‌ బంధువులు, మిత్రులతోనూ మంతనాలు చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియనే కీలకమైన దశ ఇక్కడే పోటీ లేకుండా సాఫీగా గెలిచే దిశగా అభ్యర్థులు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా సొంతపార్టీ, కులం, వర్గం నుంచి పోటీ లేకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూ డు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్‌ బెడద ఉంది. ఈనెల 3లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

వార్డుల్లో పంచాయితీ...

గతనెల 28, 29, 30 మూడు రోజులపాటు నామినేషన్ల హంగామా కొనసాగింది. ఒక్కో వార్డులో కనీ సం ఏడెనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్నిచోట్ల పది దాటాయి. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మూడు ప్రధాన పార్టీలు కూడా బీఫామ్‌లను ఇవ్వకపోవడంతో వార్డుల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు. పార్టీ సూచించిన అభ్యర్థి కాకుండా పార్టీతో సంబంధం ఉన్న, టికెట్‌ ఆశించిన నాయకులు కూడా నామినేషన్లు వేశారు. ఎలాగైనా పార్టీ పెద్దలను ఒప్పించి తామే బీఫామ్‌ తీసుకుంటామన్న నమ్మకంతో నామినేషన్లను వేశా రు. కొంతమంది పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే రెబల్‌గా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి చాలా వార్డుల్లో సొంత పార్టీ నేతలే పోటాపోటీగా నామినేషన్లు వేశారు. భైంసా బల్దియాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు పెద్దగా ఇబ్బంది కనిపించడం లేదు. బీజేపీ నుంచి మాత్రం కొన్ని వార్డుల్లో రెబల్‌ నామినేషన్లు పడ్డాయి. ఖానా పూర్‌లో మాత్రం కాంగ్రెస్‌ ఇప్పటికే 12 మంది అభ్యర్థులను ప్రకటించి స్పష్టత ఇచ్చింది. ఇక బీజేపీలో కొంతమేరకు రెబల్స్‌ ప్రభావం కనిపిస్తోంది. పోటీగా నామినేషన్‌ వేసిన వారిని ఉపసంహరించుకునేలా చేయడానికి శుక్రవారం రాత్రి నుంచి సంప్రదింపులు మొదలయ్యాయి. ఓవైపు వేసిన నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతుంటే, వార్డుల్లో శని వారం అంతా బుజ్జగింపుల పర్వమే కొనసాగింది.

ఏదైనా 3 లోపే...

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుస్తారా.. లేదా.. అనే ఫలితం దాదాపు నామినేషన్ల ఉపసంహరణతోనే తేలిపోనుంది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుగా బరిలో ఉంటే, ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఈ రెండు రోజుల్లో సొంత పార్టీ రెబల్స్‌తోపాటు అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులను సైతం పోటీ నుంచి తప్పించాలని యోచిస్తున్నారు.

మన రైలుకు ఏ సిగ్నలో..!

పార్టీ నేతలకు తలనొప్పి...

మూడు మున్సిపాలిటీలలో వేర్వేరు రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో స్పష్టంగా చెప్పలేని విధంగా ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు చాలాచోట్ల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి నామినేషన్ల ఘట్టంలో ఆయా పార్టీలను ఇబ్బంది కూడా పెడుతోంది. పార్టీకి సంబంధం లేకుండా కూడా కొంతమంది సీనియర్‌ నేతలు నామినేషన్లు వేయడం, ఎన్నికల్లో తామే గెలుస్తామని బలంగా చెబుతుండటంతో వారిని ఉపసంహరణకు ఒప్పించడం ఆయా పార్టీల పెద్దలకు కష్టంగా మారింది. నిర్మల్‌లో బీజేపీకి సంబంధించి కొన్నివార్డుల్లో తమను కాదని కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడంతో సీనియర్లు నామినేషన్లు వేశారు. మరికొంతమంది సీనియర్లకు సొంత వార్డులు కాకుండా ఎక్కడెక్కడి నుంచో నామినేషన్లు వేయించారు. వారిలో చాలామంది అసంతృప్తితోనే ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వర్గాలు ఉండడంతో రెండు మూడుచోట్ల సొంత పార్టీ నుంచే పోటీ తప్పడం లేదు. రెబల్స్‌ విషయంలో ఈసారి బీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దగా ఇబ్బంది లేదు. ఎంఐఎం నుంచి పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకే నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌, ఎంఐఎం నుంచి టికెట్‌ ఆశించి, రాని మైనార్టీ నేతలు గులాబీ కండువా వేసుకుని బీఆర్‌ఎస్‌ బీఫామ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

మహిళలు, బాలికల రక్షణే షీటీం లక్ష్యం

నిర్మల్‌టౌన్‌: మహిళలు, బాలికల రక్షణే ప్రధా న లక్ష్యంగా షీటీం, భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి స్కూల్‌ పరిసరాల్లో రెండు, మూడు రోజులుగా కొందరు పోకిరీలు స్కూల్‌ ముగిసే సమయంలో అక్కడే చెక్కర్లు కొడుతున్నారన్న సమాచారంతో.. భరోసా సి బ్బంది శనివారం అక్కడికి వెళ్లి పహారా నిర్వహించారు. పోకిరీలను అదుపులోకి తీసుకున్నా రు. వారు మైనర్లు కావడంతో తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలి కలు, విద్యార్థుల రక్షణపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నరు. చట్టపరమైన రక్షణ కల్పించడంలో షీటీం, భరోసా సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

నిర్మల్‌1
1/3

నిర్మల్‌

నిర్మల్‌2
2/3

నిర్మల్‌

నిర్మల్‌3
3/3

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement