వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి
భీమారం: మండలంలోని మాంతమ్మ సమీపంలో రోడ్డు దాటుతున్న చుక్కలదుప్పిని ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మంచిర్యాల అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జి.రత్నాకర్ రావు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఘటన స్థలాన్ని మంచిర్యాల ఎఫ్‌డీవో సర్వేశ్వర్ పరిశీలించారు.
యువకుడిని కాపాడిన ఆటోడ్రైవర్
బాసర: బాసర గోదావరి బ్రిడ్జిపై దూకేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని ఆదివారం ఆటోడ్రైవర్ కాపాడాడు. నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ షకీర్, రిపోర్టర్ లతీఫ్ గమనించారు. యువకుడు మద్యం మత్తులో గోదావరిలో దూకేందుకు యత్నించగా కాపాడి ఆటోలో బాసరకు తరలించారు.


