లక్ష్మణచాంద/మామడ: కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. లక్ష్మణచాంద, మామడ మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. రాచాపూర్ రూ.69 లక్షలు, పొట్టపల్లి(కె)లో రూ.62 లక్షలు, లక్ష్మణచాందలో రూ.1.83 కోట్లు, పార్‌పల్లిలో రూ.81.40 లక్షలతో చేపట్టే పనులను ప్రారంభించారు. సోన్ మండలం న్యూవెల్మల్‌లో రూ.62 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మామడల మండలం నూస్వాంగ్వి గ్రామంలో రూ.77.70 లక్షల విలువైన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. న్యూబొప్పారం గ్రామంలో రూ.1.10 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కూచన్‌పల్లిలో రూ.31.90 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ఎంపీడీవో రాధ, డీటీ బాబుసింగ్, లక్ష్మణచాంద మండల అధ్యక్షుడు చిన్నయ్య, సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, సర్పంచులు ఓస కవిత, ముఖేష్, మహేశ్, పుష్ఫ, అశ్విన్‌రెడ్డి, సూరి, తిరుపతి, రాచకొండ సాగర్, నరేశ్, అంకం మమత, మాజీ ఎంపీపీలు అడ్వాల రమేశ్, మాజీ ఎంపీపీ హరీశ్, మాజీ సర్పంచ్ ముత్యంరెడ్డి, ఉప సర్పంచ్ వర్ష రవి, రవీందర్, పోశెట్టి, నాయకులు బాపురెడ్డి, రాజారెడ్డి, రంజిత్‌కుమార్, నాగయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
విద్యార్థులతో భోజనం
తన పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని కేజీబీవీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కింద కూర్చోని కలిసి భోజనం చేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ కవిత, ఎస్‌వో నవిత తదితరులు పాల్గొన్నారు.


