ఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబా లకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు.


